వైఎస్‌ విగ్రహం ముక్కు, చేతిని విరగ్గొట్టిన దుండగులు

ABN , First Publish Date - 2022-11-25T01:12:36+05:30 IST

నాగులాపల్లి ఉప్పరగూడెంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

వైఎస్‌ విగ్రహం ముక్కు, చేతిని విరగ్గొట్టిన దుండగులు

నాగులాపల్లి(కొత్తపల్లి) నవంబరు 24: నాగులాపల్లి ఉప్పరగూడెంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైఎస్‌ విగ్రహం ముక్కు, చేతి వేళ్లను దుండగులు బద్దలుగొట్టి పరారయ్యారు. గ్రామస్థుడు గురాల నూకాలు ఫి ర్యాదు మేరకు పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీని వాస్‌ ఆధ్వర్యంలో కొత్తపల్లి ఎస్‌ఐ రామలింగేశ్వరరావు పోలీసు జాగిలంతో గ్రామంలో గాలించారు. గ్రామానికి చెందిన సన్నిబోయిన పెద నూకరాజు ఇంటివద్ద జాగిలం ఆగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురానికి చెందిన శిల్పి కాగితాల కృష్ణతో విగ్రహంలో విరిగిన ముక్కు, చేతి వేళ్లను సీఐ ఆధ్వ ర్యంలో అతికించారు.

ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలిం చారు. రైతులకు ఎటువంటి అసౌ

Updated Date - 2022-11-25T01:12:36+05:30 IST

Read more