యోగా విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ

ABN , First Publish Date - 2022-11-28T01:36:55+05:30 IST

యోగా విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ అని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఆదే్‌షకుమార్‌ అన్నారు. రామారావుపేటలోని శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ యోగా పోటీలు ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

యోగా విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ

శ్రీప్రకాష్‌లో ముగిసిన సౌత్‌జోన్‌ యోగా పోటీలు

పెద్దాపురం, నవంబరు 27: యోగా విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ అని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఆదే్‌షకుమార్‌ అన్నారు. రామారావుపేటలోని శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ యోగా పోటీలు ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యోగా అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పద్ధతిలో మెరుగుపరుచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిదన్నారు. మరో ముఖ్యఅతిథులు యూబీఐ రీజినల్‌ హెడ్‌ కె.చిన్నారావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ ప్రేమ్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ యోగా అంతరాత్మను, విశ్వాసాత్మకతను ఏకంచేసే మార్గమన్నారు. పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ సౌత్‌జోన్‌ స్థాయిలో తమ పాఠశాలలో మూడురోజులపాటు యోగా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజేతలకు ముఖ్యఅతిథులు బహుమతులను అందజేశారు. ప్రొఫెసర్‌ ఎస్‌ఆర్‌ సంతానం, పాఠశాల సీనియర్‌ ప్రిన్సిపాల్‌ యం

Updated Date - 2022-11-28T01:36:57+05:30 IST