వైసీపీ పాలనలో మాట్లాడే హక్కు కూడా లేదు

ABN , First Publish Date - 2022-11-21T01:32:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వపాలనలో మాట్లాడే హక్కును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి చెల్లి అశోక్‌ పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో మాట్లాడే హక్కు కూడా లేదు

ముమ్మిడివరం, నవంబరు 20: వైసీపీ ప్రభుత్వపాలనలో మాట్లాడే హక్కును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి చెల్లి అశోక్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం టీడీపీ సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌ ఆశలేటి నిర్మల, మాదాల సునీత, బంటు రోజా, సునీతారాణిలపై అక్రమ కేసులు బనాయించి గుడివాడ పోలీసులు అరెస్టు చేయడం అమానుష చర్య అన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గొలకోటి దొరబాబు మాట్లాడుతూ చంద్రబాబుపై దాడులు చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పేర్కొనడం రాజకీయాల్లో సరికాదన్నారు.

Updated Date - 2022-11-21T01:32:35+05:30 IST

Read more