వైసీపీ దుర్మార్గాలను తిప్పి కొట్టాలి

ABN , First Publish Date - 2022-12-12T01:02:24+05:30 IST

రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ ప్రభుత్వంచేసే దుర్మార్గాలను తిప్పికొట్టడా నికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు.

వైసీపీ దుర్మార్గాలను తిప్పి కొట్టాలి

రాజోలు, డిసెంబరు 11: రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ ప్రభుత్వంచేసే దుర్మార్గాలను తిప్పికొట్టడా నికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. తాటిపాకలోని ఆయన స్వగృహం వద్ద ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేసి రాష్ట్రంలో మళ్లీ గెలవాలని, దుర్మా ర్గమైన ఆలోచనలతో వైసీపీ నాయకులు ఉన్నారని... వాటిని ఎదుర్కొని వైసీపీని మట్టికరిపించి రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేసి తీరుతామన్నారు. క్లస్టర్లు, యూనిట్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కమిటీల కన్వీనర్లు ఓటరు జాబి తాలపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారతార న్నారు. గ్రామాల్లో టీడీపీకి విశేష స్పందన లభిస్తోంద న్నారు. రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, చాగంటి స్వామి, అడబాల యుగంధర్‌, ఈలి శ్రీనివాస్‌, కాండ్రేగుల రాము, మానుకొండ దుర్గాప్రసాద్‌, ఆరుమిల్లి భాను, నాగిరెడ్డి గోపి, అడబాల సత్యరమేష్‌, రాపాక నవ రత్నం, మామి డిశెట్టి నాగరాజు, గుద్దటి చిట్టబ్బాయి, పోతురాజు రాధా కృష్ణ, చెల్లింగి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T01:02:24+05:30 IST

Read more