వైసీపీ పాలనలో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-04-24T06:58:25+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనలో చార్జీలు, పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

వైసీపీ పాలనలో బాదుడే బాదుడు

మండపేట, ఏప్రిల్‌ 23: వైసీపీ మూడేళ్ల పాలనలో చార్జీలు,  పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి మండపేటలో నిర్వహించిన టీడీపీ గౌరవసభలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యుత్‌ చార్సీల పెంపును నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు,  కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.Read more