ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారత్‌

ABN , First Publish Date - 2022-08-10T06:19:35+05:30 IST

ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశమని చెప్పడానికి గర్వంగా వుందని మునిసిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారత్‌

రాజమహేంద్రవం సిటీ, ఆగస్టు 9: ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశమని చెప్పడానికి గర్వంగా వుందని మునిసిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ప్రణవ సంకల్ప యోగా వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు పతంజలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. దీనికి కమిషనర్‌తోపాటు సెంట్రల్‌ జైలు సూపరింటిండెంట్‌ ఎస్‌.రాజారావు ముఖ్యఅతిథులుగా విచ్చేసి యోగా విశిష్టతను వివరించారు. 75 ఏళ్లలో ప్రపంచానికి భారత్‌ ఎన్నో ఇచ్చిందని వాటిలో మొదటి మూడు స్థానాల్లో యోగా ఒకటిగా వుందన్నారు. తొలిదశ కొవిడ్‌ సమయంలో బాధితులకు యోగా గురువు పతంజలి శ్రీనివాస్‌ అందించిన మనోధైర్యం, యోగా శిక్షణ ఆకట్టుకుందన్నారు. ఈరోజు ఉన్నజీవన శైలి విధానానికి యోగా తప్పనిసరి అన్నారు. అనంతరం యోగా గురువులు ఎస్‌.సుందరి లీలాకుమారి, ఎస్‌కె రహీమా బేగం, కె.లలితకుమారి, పి.కాశీఅన్న పూర్ణ, ఎ.ఇందిరా దేవి, వై.నాగేశ్వరావు, ధనాజీజె, కేవీవీ సత్యనారాయణ, ఎస్‌.తాతారావు, బోండా రమేష్‌, బి.శివ, లంక సత్యనారాయణ, కల్పనా మూర్తి, అయ్యన్న ,రాము, ఎంఏడి రాజు, ఎం.సత్యనారాయణ, కేఎన్‌వీ శ్రీధర్‌రెడ్డి, వీబీఎస్‌ గాంధీ, వి.వెంకన్నబాబు, పి.నాగేశ్వరావు, హేమ, పతంజలి శ్రీనివాస్‌లను కమిషనర్‌ సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమాన్ని పంతంజలి శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

Read more