-
-
Home » Andhra Pradesh » East Godavari » who attack registered fri-NGTS-AndhraPradesh
-
దాడికి పాల్పడ్డవారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలి
ABN , First Publish Date - 2022-02-23T06:30:46+05:30 IST
అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్రపై ఎస్కేబీఆర్ కళాశాల సిబ్బంది దాడికి పాల్పడడమే కాకుండా కులం పేరుతో హేళన చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండు చేస్తూ అమలాపురం పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట మంగళవారం ఏబీవీపీ నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలి పారు.

అమలాపురం టౌన్, ఫిబ్రవరి 22: అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్రపై ఎస్కేబీఆర్ కళాశాల సిబ్బంది దాడికి పాల్పడడమే కాకుండా కులం పేరుతో హేళన చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండు చేస్తూ అమలాపురం పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట మంగళవారం ఏబీవీపీ నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలి పారు. ఎస్కేబీఆర్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని శాంతియు తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి యాజమాన్యానికి లేఖ ఇవ్వడా నికి వెళ్లగా నరేంద్రపై దాడి చేయడమే కాకుండా విద్యార్థులను కులం పేరుతో హేళనచేసిన ఘటనపై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు. జరిగిన ఘట నపై కేసు నమోదు చేయకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో చలో ఎస్పీ కార్యాల యం కార్యక్రమం చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.