ఇంత నిర్బంధమా..

ABN , First Publish Date - 2022-08-31T06:54:37+05:30 IST

నవ్య సమాజం వైపు అడుగులు వేయించే గురువులపై రాష్ట్ర ప్రభు త్వం ఇంతటి నిర్బంధం విధించడం దారుణమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) ఆరోపించారు.

ఇంత నిర్బంధమా..

గురువులపై ఇదేం దారుణం : ఐవీ

అమలాపురం టౌన్‌, ఆగస్టు 30: నవ్య సమాజం వైపు అడుగులు వేయించే గురువులపై రాష్ట్ర ప్రభు త్వం ఇంతటి నిర్బంధం విధించడం దారుణమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) ఆరోపించారు. చలో అమరావతికి పిలుపునివ్వని సం ఘాల ప్రతినిధులను సైతం అరెస్టుచేసి పోలీస్‌ స్టేష న్లకు తరలించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ విధానం రాక్షస పాలనను తలపిస్తోందని ధ్వజ మెత్తారు. మంగళవారం ఆయన అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులను పాఠ శాల నుంచి పోలీస్‌స్టేషన్లకు తరలించడం, కొందరిని దారిలో అడ్డగించి.. ఇంకొందరిని ఇంటి నుంచి స్టేషన్లకు తరలించడం, మరెందరినో ఆ మూల నుంచి ఈ మూలన ఉన్న పోలీస్‌ స్టేషన్లకు తరలించి వేధింపులకు పాల్పడడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. చలో అమరావతికి వెళ్లమని సంతకాలు చేయకుంటే కేసులు నమోదు చేస్తామని ఉపాధ్యాయులను బెదిరించడం ఏ పాలన కిందకు వస్తుందన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు డీజీపీని కలిసిన తరువాత మాత్రమే ఉపాధ్యాయులను విడుదల చేశారన్నారు. ఉపాధ్యా యుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాఽధీనం చేసుకుని పరిశీలించడం దుర్మార్గమన్నారు. దీని ఫలితాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని ఐవీ హెచ్చరించారు.



Updated Date - 2022-08-31T06:54:37+05:30 IST