ముంపునీరు దిగకపోతే నారుమడులు ఎలా వేయాలి!

ABN , First Publish Date - 2022-07-05T07:17:15+05:30 IST

పోతవరం, ముంగండ గ్రామ సరిహద్దు ప్రాంతంలో డ్రెయిన్లు ఆక్రమణలకు గురై అస్తవ్యస్తంగా ఉండటంతో మిగులు నీరు క్రిందకు దిగక సంబంధిత ఆయకట్టు ముంపులో ఉందని ఆకుమడులు ఎలా వేయాలని రైతులు అధికారులను ప్రశ్నించారు.

ముంపునీరు దిగకపోతే నారుమడులు ఎలా వేయాలి!

పి.గన్నవరం, జూలై 4: పోతవరం, ముంగండ గ్రామ సరిహద్దు ప్రాంతంలో డ్రెయిన్లు ఆక్రమణలకు గురై అస్తవ్యస్తంగా ఉండటంతో మిగులు నీరు క్రిందకు దిగక సంబంధిత ఆయకట్టు ముంపులో ఉందని ఆకుమడులు ఎలా వేయాలని రైతులు అధికారులను ప్రశ్నించారు.  సోమవారం తహశీల్దార్‌ జీఆర్‌ ఠాగూర్‌కు వినతిపత్రం అందించారు.  ఈఆయకట్టులో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా నారుమడులు వెయ్యలేదని, సరైన చర్యలు చేపట్టకపోతే పంట విరామం ప్రకటిస్తామని రైతులు అఽధికారులను హెచ్చరించారు. వినతిపత్రం అందించిన వారిలో కుంపట్ల శ్రీనివాసరావు, జికె కృష్ణమూర్తి, కెబిస్‌ నారాయణ, కోట శ్రీనివాసు, రొక్కాల శ్రీనివాసు, సత్యనారాయణ, పులపర్తి శ్రీను  ఉన్నారు.


Read more