‘వీఆర్‌ఏల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి’

ABN , First Publish Date - 2022-02-19T05:45:29+05:30 IST

వీఆర్‌ ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా డిమాండ్‌ చేశారు.

‘వీఆర్‌ఏల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి’

ఏలేశ్వరం, ఫిబ్రవరి 18: వీఆర్‌ ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా డిమాండ్‌ చేశారు.   ఏలేశ్వరం తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద మండల వీఆర్‌ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. కాకినాడ పార్లమెంటరీ అధికారప్రతినిధి పైల సుభాష్‌చంద్రబోస్‌, టీడీపీ మండలాధ్యక్షుడు సూతి బూరయ్య, కొమ్ముల కన్నబాబు, బస్సా లక్ష్మీప్రసాద్‌, పార్టీ నేతలతో కలసి వరుపుల రాజా దీక్షా శిబిరాన్ని సందర్శించి వీఆర్‌ఏల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. 

‘వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి’

ప్రత్తిపాడు: వీఆర్‌ఏల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని ప్రత్తిపాటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల డిమాండ్‌ చేశారు. ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్‌ఏల శిబిరం వద్దకు వెళ్లి రాజా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అర్హులైన వీఆర్‌ఏలను  వీఆర్వోలుగా ప్రమోట్‌ చేయాలని వీఆర్‌ఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని రాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో కాకినాడ పార్లమెంటరీ టీడీ పీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, ఏలూరు, ఉత్తరకంచి సర్పంచ్‌ రొంగల సత్యనారా యణ, మంతెన వెంకటరమణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చంటిబాబుకు వీఆర్‌ఏల వినతి 

జగ్గంపేటరూరల్‌: తమ న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషిచేయాలని జగ్గంపేట నియోజకవర్గం మండలాలు గండేపల్లి, జగ్గంపేట, గోకవరం మండల అధ్యక్షులు, కార్యదర్శులు శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వినతిపత్రం అందజేశారు. పెద్దాపురం డివిజన్‌ అధ్యక్షుడు నిడమర్తి సురేష్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి చిన్న బాలాజీ, గోకవరం మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.  Read more