చవితిసందడి

ABN , First Publish Date - 2022-08-31T06:48:01+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రుల వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లుచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లిలోని శ్రీసిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

చవితిసందడి
మండపేటలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వివిధ రకాల వినాయకుడి విగ్రహాలు

గణేష్‌ ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయంలో నేటి నుంచి వేడుకలు

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ పందిర్లు, విగ్రహాల ఏర్పాటు

వివిధ రకాల పండ్ల ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రుల వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లుచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లిలోని శ్రీసిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి హాజరుకానున్న దృష్ట్యా, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశారు. అదేవిధంగా గణేష్‌ నవరాత్రుల కోసం జిల్లా పరిధిలోని అన్ని ప్రాం తాల్లో పందిర్లు వేసి విద్యుద్దీపాలతో కనులు మిరుమిట్లు గొలిపే రీతిలో అలంకరణలు చేశారు. అమలాపురం పట్టణంలోని గడియారస్తంభం సెంటర్‌, షరాబుల పందిరి, మార్కెట్‌ వీధితోపాటు పట్టణంలోని అన్ని ముఖ్య కూడళ్లలో పందిర్లు వేసి పూజలకు సిద్ధం చేశారు. జిల్లాలో పలుచోట్ల భారీ గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నారు. మూడు అడు గుల నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆయా  ప్రాంతాల్లో ఉత్సవ కమి టీల ఆధ్వర్యంలో నెలకొల్పారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, వర్తకసంఘాల ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమ లను పంపిణీ చేశారు. అమలాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అడ్మిన్‌ ఎస్పీ లతామాధురి వీటిని భక్తులకు అందజేశారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి అనుమతులు తీసుకోవ డంతోపాటు ఆయా పందిర్ల వద్ద ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కమిటీ పెద్దల పైనే బాధ్యతలు పెట్టే విధంగా అధికారులు అనుమతులు ఇచ్చారు. 

చుక్కల్ని అంటుతున్న ధరలు..

ఇదిలా ఉండగా బుధవారం జరిగే వినాయక చవితి వేడుకల కోసం జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం, రాజో లు, కొత్తపేట, పి.గన్నవరం వంటి ప్రాంతాలతోపాటు గ్రామగ్రామాన పత్రిలు, పండ్లు, పువ్వులు, పూజా సామగ్రి విక్రయాలు జోరుగా సాగాయి. అయితే ధరలు తీవ్రంగా పెంచి విక్రయించడంతో వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇటీవల నలభై రోజులకుపైగా వరదలు సంభవించడంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో పండ్ల తోటలు, పత్రులు వంటి పంటు దెబ్బతిన్నాయి. దాంతో ఇతర ప్రాం తాల నుంచి సరుకులను దిగుమతి చేసుకున్న వ్యాపారులు ధరలు పెంచి విక్రయి స్తున్నారు. యాపిల్‌ పండ్లు నాలుగు రూ.వంద, ఐదు బత్తాయిలు రూ.వంద, ఐదు మొక్కజొన్న రూ.వంద, డజను అరటిపండ్లు రూ.60, వంద గ్రాముల చామంతి పూజా రూ.50పైనే... ఇలా అనేక రకాల పండ్ల, పూల ధరలను అనూహ్యంగా పెంచే యడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే రెండు మూడేళ్ల తర్వాత ఈసారి మాత్రం చవితి మార్కెట్లు సందడిగా మారడం కనిపించాయి.

మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

అమలాపురం టౌన్‌, ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అద నపు కార్యదర్శి యెండూరి రాఘవ, డైరెక్టర్‌ నందిపాటి నాగ లక్ష్మిల ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయకుని ప్రతిమ లను పంపిణీ చేశారు. అమలాపురం మెయిన్‌రోడ్డులో ఏర్పా టుచేసిన కార్యక్రమానికి అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి ముఖ్య అతిథిగా హాజరై వినాయక ప్రతిమలను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో స్థానిక గడియార  స్తంభం సెంటర్‌లో సంఘ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను పట్టణ సీఐ కొండలరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో యేడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-08-31T06:48:01+05:30 IST