నిలిచిన వెబ్‌ల్యాండ్‌ సేవలు!

ABN , First Publish Date - 2022-04-24T06:56:18+05:30 IST

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సాఫ్ట్‌వేర్‌ ఆధునికీకరణ పేరుతో గత కొన్ని రోజుల నుంచి ‘వెబ్‌ల్యాండ్‌’ సేవలు నిలిచిపోయాయి.

నిలిచిన వెబ్‌ల్యాండ్‌ సేవలు!

జిల్లావ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ 

 రోజుకు 200పైనే ఆగిపోతున్న భూమి రిజిస్ట్రేషన్లు

రూ.50 లక్షల నుంచి 75 లక్షల మేర ఆదాయానికి గండి 

 ఆందోళనలో భూముల యజమానులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సాఫ్ట్‌వేర్‌ ఆధునికీకరణ పేరుతో గత కొన్ని రోజుల నుంచి ‘వెబ్‌ల్యాండ్‌’ సేవలు నిలిచిపోయాయి. దాంతో రైతులతోపాటు సేవా వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వ్యవసాయ భూములు, సొసైటీల లావాదేవీలకు సంబంధించిన రికార్డుల రెన్యూవల్స్‌ నిలిచిపో యాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో కోనసీమ జిల్లాలో నిత్యం రూ.50 లక్షల పైబడి ప్రభుత్వ ఆదాయా నికి గండిపడుతోంది. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ర్టేషన్లుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తహశీల్దార్‌ కార్యాల యాల కేంద్రంగా వెబ్‌ల్యాండ్‌ సేవలు గత నెల 24వ తేదీ నుంచి నిలిచి పోయాయి. వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ పని చేయకపోవడం వల్ల అనేక రకాల సేవలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో, రెవెన్యూశాఖకు సంబంధించి కీలక సేవలు నిలిచిపో యాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కుమార్తెలకు కట్నకానుకలుగా భూములు రిజిస్ర్టేషన్‌ చేసే ప్రక్రియతోపాటు అత్యవసరంగా డబ్బులు అవసరమైనవారు భూములు విక్రయించేందుకు వీలుపడని పరిస్థితి ఏర్ప డింది. ముఖ్యంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల ద్వారా వ్యవసాయ భూ ముల రిజిస్ర్టేషన్‌కు మాత్రమే అవాంతరం ఏర్పడింది. నివాస గృహాలు, ఫ్లాట్లు క్రయవిక్రయాలకు ఎటువంటి అవరోధం లేదు. ఉదాహరణకు ఒక రైతు వ్యవసాయభూమి విక్రయించడానికి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వస్తే ఆ డాక్యుమెంటు ఆధారంగా తహశీల్దార్‌ కేంద్రంగా పనిచేసే వెబ్‌ ల్యాండ్‌లో ఆ రైతుకు సంబంధించిన భూముల వివరాలు 1బీలో చూపి స్తేనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతంది. లేనిపక్షంలో ఆ భూము లను రిజిస్ర్టేషన్‌ చేసే అవకాశం లేదు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎన్‌ఐసీ సంస్థ అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. వెబ్‌ల్యాండ్‌కు, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి మధ్యనున్న సర్వర్‌ను ఎన్‌ఐసీ అనుసంధానం చేస్తుంది. అయితే ఆ సేవలు నిలిచిపోవడంతో  కోనసీమ జిల్లాలో 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు పరిధిలో రోజుకు 200 నుంచి 250 రిజిస్ర్టేషన్లు నిలిచిపోతున్నాయి. దీనివల్ల సుమారు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌ కావడం వల్ల పసుపు-కుంకుమ మాన్యాల కింద భూముల రిజిస్ర్టేషన్‌ నిలిచిపోవడం, తనఖా రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడం, సొసైటీల్లో రుణాల కోసం 1బీ రికార్డులు వంటివి తీసుకునే సౌకర్యం లేక వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత కొన్నిరోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించక పోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. రానున్న రోజుల్లో భూ ముల రిజిస్ర్టేషన్ల విలువ పెంచి అప్పుడు ఆయా భూములను రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలంటే అదనపు ఆర్థిక భారంపడే అవకాశముంది. బ్యాంకు ల్లో రుణాలు పొందాలంటే తహశీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో ఉన్న 1బీ అడంగల్‌ తీసుకురమ్మని సొసైటీలు, బ్యాంకులు చెబుతున్నాయి. వీటిని పొందేందుకు వెబ్‌ల్యాండ్‌ పనిచేయకపోవడం వల్ల రైతులకు రుణాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై అమలాపు రం సబ్‌రిజిస్ర్టార్‌ రత్నకుమార్‌ను వివరణ కోరగా వెబ్‌ల్యాండ్‌ సమస్య ఉన్నమాట వాస్తవేమనని, త్వరలో పరిష్కారం లభించవచ్చని చెప్పారు.



Updated Date - 2022-04-24T06:56:18+05:30 IST