స్వామివారి హుండీఆదాయం రూ.40,11,172

ABN , First Publish Date - 2022-03-04T06:04:30+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కించారు. దేవదాయ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్‌ శింగం రాధ, కె.సూర్యవెంకటదుర్గ, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు.

స్వామివారి హుండీఆదాయం రూ.40,11,172

 ఆత్రేయపురం, మార్చి 3:  వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కించారు. దేవదాయ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్‌ శింగం రాధ, కె.సూర్యవెంకటదుర్గ, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు. 28రోజులకుగాను ప్రధాన హుండీలద్వారా రూ.35,20,968, అన్నప్రసాద హుండీల  ద్వారా రూ.4,90,204 కలిపి స్వామివారి ఆదాయం రూ.40,11,172 లభించింది. బంగారం  27 గ్రాములు, వెండి 293 గ్రాములు స్వామివారి హుండీల ద్వారా భక్తులు సమర్పించారు. అలాగే విశ్వేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.73,326 లభించినట్టు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ లెక్కింపులో పోలీసులు, బ్యాంకు సిబ్బంది, గ్రామస్తులు, అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.


Read more