ఉపాధి కోసం వెళ్లి... ముగ్గురు గిరిజనుల అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-11-28T01:30:41+05:30 IST

ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం వలస వెళ్లిన ముగ్గురు గిరిజనులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఉపాధి కోసం వెళ్లి... ముగ్గురు గిరిజనుల  అనుమానాస్పద మృతి

కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

మారేడుమిల్లి, నవంబరు 27: ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం వలస వెళ్లిన ముగ్గురు గిరిజనులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు గిరిజనులు నెలరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం పనికి వెళ్లారు. వీరిని తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరుకు చెందిన మద్యవర్తి పని నిమిత్తం తీసుకువెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. శుక్రవారం గుర్తు తెలియని మృతదేహాలు కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి తీరంలో శ్రీశైలం తిరుగు జలాల్లోకి కొట్టుకురావడంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టి దేవరపల్లి గ్రామస్థుల కు సమాచారం అందించారు. మాజీ ఎంపీటీసీ కానెం విజయలక్ష్మి ఆధ్వర్యం లో గ్రామస్థులు ఆదివారం అక్కడికి చేరుకొనే సరికి మృత దేహాలు పూర్తి గా పాడవడంతో అప్పటికే ఖననం చేశారు. పోలీసులు అందించిన ఫొటోలు ఆధారంగా వలల చిన్నారెడ్డి(28), పొత్రు వెంకటరెడ్డి(20)లుగా మృతు లను గుర్తించారు. ఇదిలావుండగా ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా నంది కొట్కూరు ప్రాంతంలో మరో మృతదేహం కొట్టుకురావడంతో దాన్ని పత్రి మంగిరెడ్డి(30)గా గుర్తించారు. అయితే వీరితోపాటు వెళ్లిన మరో నలుగురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు దేవరపల్లి గ్రామస్థులు తెలిపారు. దీనిపై కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.మూర్తి, అకడమిక్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:30:42+05:30 IST