రైలు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-09-11T06:18:55+05:30 IST

తుని, సెప్టెంబరు 10: మండలంలో హంసవరం, తిమ్మాపురం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. తుని ప్రభుత్వ రైల్వే పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మా రూఫ్‌ వివరాలు అందజేస్తూ హంసవరం, తిమ్మాపురం రైల్వేస్టేషన్ల మధ్య తుని

రైలు ఢీకొని ఒకరి మృతి

తుని, సెప్టెంబరు 10: మండలంలో హంసవరం, తిమ్మాపురం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. తుని ప్రభుత్వ రైల్వే పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మా రూఫ్‌ వివరాలు అందజేస్తూ హంసవరం, తిమ్మాపురం రైల్వేస్టేషన్ల మధ్య తుని నుంచి అన్నవరం వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మార్జురీలో భద్రపరిచామన్నారు. వివరాలు తెలిసినవారు తుని ప్రభుత్వ రైల్వేపోలీ్‌సస్టేషన్‌లో లేదా 9490619020, 94948 87786లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

లారీ ఢీకొని మరొకరు..

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 10: తూ రంగి అయ్యప్పస్వామి గుడివద్ద శనివారం లారీ ఢీకొని అదేగ్రామానికి చెందిన దొంతబొచ్చు కామేశ్వరరావు(40) మృతి చెందా డు. ఇంద్రపాలెం పోలీసుల వివరాల ప్రకా రం.. కాకినాడ భానుగుడిలోని ఫ్లెక్సీ షాపు లో పనిచేసే కామేశ్వరరావు నడిచి వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. లారీ చక్రాలు తలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి సూర్యభాస్కరరావు ఫిర్యాదుతో కేసు నమో దు చేసినట్టు ఎస్‌ఐ ఎం.నాగరాజు తెలిపా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించామన్నారు.

Updated Date - 2022-09-11T06:18:55+05:30 IST