రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-15T05:49:00+05:30 IST

సామర్లకోట, ఆగస్టు 14: సామర్లకోట రైల్వే పోలీస్టేషన్‌ పరిధి జి.మేడపాడు రైల్వే యార్డు వద్ద ఆదివారం పట్టాలు దాటుతున్న సుమారు 38ఏళ్ల వ్యక్తిని

రైలు ఢీకొని వ్యక్తి మృతి

సామర్లకోట, ఆగస్టు 14: సామర్లకోట రైల్వే పోలీస్టేషన్‌ పరిధి జి.మేడపాడు రైల్వే యార్డు వద్ద ఆదివారం పట్టాలు దాటుతున్న సుమారు 38ఏళ్ల వ్యక్తిని వేగంగా వెళ్తు న్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే కీమెన్‌ బన్వర్‌లాల్‌ అందించిన సమాచారంతో రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యా ప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.

Read more