నేడు ‘విద్యాకానుక’ పంపిణీ: డీఈవో

ABN , First Publish Date - 2022-07-05T07:11:51+05:30 IST

కొవ్వూరు మండలం ఐ.పంగిడి జడ్పీ హైస్కూల్‌లో మంగళవారం జగనన్న విద్యాకానుక మూడో విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు.

నేడు ‘విద్యాకానుక’ పంపిణీ: డీఈవో

కొవ్వూరు, జూలై 4: కొవ్వూరు మండలం ఐ.పంగిడి జడ్పీ హైస్కూల్‌లో మంగళవారం జగనన్న విద్యాకానుక మూడో విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు. సోమవారం పాఠశాలను సందర్శించి, విద్యాకానుక మెటీరియల్‌ను పరిశీలించారు. అబ్రహాం మాట్లాడుతూ సోమవారం జరగనున్న జిల్లాస్థాయి విద్యాకానుక పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత హాజరవుతారన్నారు. వేసవి సెలవుల అనంతరం మంగళశారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయన్నారు. పంగిడి పాఠశాలలో నాడు-నేడు కింద మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు డీఈవో చెప్పారు. అనంతరం విద్యాకానుక పంపిణీకి సంబంధించి సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో కెంపురత్నం, ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బీవీ రవికుమార్‌(పంగిడి), జి.రత్నకుమార్‌(పశివేదల), వై.యుగంధర్‌కుమార్‌(వాడపల్లి), తిరుమలదాసు(బాలుర హైస్కూల్‌, కొవ్వూరు), కె.రామకిషోర్‌(ధర్మవరం), ఎంఎస్‌ శ్యామల(బాలికల హైస్కూల్‌, కొవ్వూరు), టీఎస్‌ రామానుజం(ఊనగట్ల), ఎన్‌.శ్రీనివాస్‌(శెట్టిపేట), పి.వీర్రాజు(చాగల్లు), మంగిన శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు. 

Read more