-
-
Home » Andhra Pradesh » East Godavari » tidco houses-NGTS-AndhraPradesh
-
నవంబర్‌లో టిడ్కో గృహాలు
ABN , First Publish Date - 2022-08-31T06:38:12+05:30 IST
నవంబర్ నాటి కి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించనున్నట్టు టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్ అన్నారు.

చైర్మన్ ప్రసన్నకుమార్
కొవ్వూరు/నిడదవోలు, ఆగస్టు 30 : నవంబర్ నాటి కి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించనున్నట్టు టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్ అన్నారు. కొవ్వూరు, నిడదవోలు పట్టణాల్లో టిడ్కో గృహాలను మంగళవారం టిడ్కో చైర్మన్, అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఇటీవల 46 వేల టిడ్కో గృహాలను అందజేశామన్నారు. రెండో విడతలో మరికొన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవ్వూరు పట్టణంలో 10 బ్లాక్‌లలో 480 టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు.ఈ మేరకు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదు పాయాలను పక్కాగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట కొవ్వూరు, నిడదవోలు మునిసిపల్ చైర్మన్లు బావన రత్నకుమారి,బి.ఆదినారాయణ, టిడ్కో ఎస్‌ఈ బి.శ్రీనివాసరావు, ఈఈ స్వామినాయు డు, డీఈ జె.నాగేశ్వరి, ఏఈ టి.మణికంఠ, టీపీవో శ్రీధర్, నిడదవోలు కమి షనర్ కెవి పద్మావతి తదితరులు ఉన్నారు.