టిడ్కో గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై రగడ

ABN , First Publish Date - 2022-12-30T01:03:17+05:30 IST

మండపేట పట్టణం గొల్లపుం తలో నిర్మించిన టిడ్కోగృహాలకు మౌలిక వసతులు కల్పించ లేదని, అక్కడి ప్రజలు ఎలా జీవనం సాగించాలని టీడీపీ కౌన్సిలర్‌ కాళ్లకూరి స్వరాజ్యలక్ష్మికౌన్సిల్‌లో ప్రశ్నించారు.

టిడ్కో గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై రగడ

మండపేట, డిసెంబరు 29: మండపేట పట్టణం గొల్లపుం తలో నిర్మించిన టిడ్కోగృహాలకు మౌలిక వసతులు కల్పించ లేదని, అక్కడి ప్రజలు ఎలా జీవనం సాగించాలని టీడీపీ కౌన్సిలర్‌ కాళ్లకూరి స్వరాజ్యలక్ష్మికౌన్సిల్‌లో ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో వసతులు కల్పించకుండా మంత్రులు ప్రారం భించి లబ్ధిదారులకు ఇళ్లను ఎలా ఇచ్చారని వైసీపీ కౌన్సిలర్‌ పిల్లి శ్రీనివాస్‌ టీడీపీ సభ్యులపై ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదంజరిగింది. విద్యుత్‌, మంచినీరు తదితర వసతులు లేకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన గురువారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.సమావేశానికి ఎమ్మెల్యే వేగుళ్ల, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ తోట మాట్లా డుతూ తక్షణమే మంచి నీరు సరఫరా చేయాలని కమిషన ర్‌ను ఆదేశించారు. పింఛన్ల రద్దుపై లబ్ధిదారులకు ఆప్షన్లు ఇచ్చామని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. జన వరి నెలాఖరుకు రెండో దశలో ఇళ్లను లబ్ధిదారులకు అందిం చాలని ఎమ్మెల్యే వేగుళ్ల కోరారు. మండపేటలో క్రైస్తవుల శ్మశానవాటిక కోసం స్థలం ఇచ్చిన ఎమ్మెల్యే వేగుళ్లకు వైసీపీ కౌన్సిలర్‌ పిల్లి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. మండ పేటలో అనధికార లేఅవుట్స్‌ వేయడంతో మున్సిపల్‌ ఆదా యానికి గండి పడుతుందని టీడీపీ కౌన్సిలర్‌ చుండ్రు సుబ్బా రావుచౌదరి కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. కంపోస్టుయార్డు స్థల సమస్యపై సమావేశంలో చర్చకు వచ్చింది. కంపోస్టుయా ర్డుకు 2.75ఎకరాలు సేకరిం చామని, త్వరలో స్థలాన్ని జేసీ పరిశీలించిన తర్వాత స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్సీ తోట చెప్పారు. కంపోస్టుయార్డు స్థల సమస్యను పరిష్కరించినం దుకు సభ్యులు ఎమ్మెల్సీ తోటను అభినందించారు. సమా వేశంలో అజెండాలోని అంశా లను ఆమోదించారు. సమా వేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారయ్యబాబు, కౌన్సిలర్లు యారమాటి గంగరాజు, టీడీపీ. వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T01:03:18+05:30 IST