మూణ్ణాళ్ల ముచ్చటగా ఈట్‌ స్ట్రీట్‌

ABN , First Publish Date - 2022-01-28T06:07:27+05:30 IST

ఎంతో అర్భాటంగా కాకినాడ పీఆర్‌ కళాశాల రోడ్డులో ప్రారంభించిన ఈట్‌స్ట్రీట్‌ (చిరు వ్యాపారుల ఉపాధి)ను కొన్ని సాంకేతిక కారణాలతో మూసివేయడంతో మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.

మూణ్ణాళ్ల ముచ్చటగా ఈట్‌ స్ట్రీట్‌

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 27: ఎంతో అర్భాటంగా కాకినాడ పీఆర్‌ కళాశాల రోడ్డులో ప్రారంభించిన ఈట్‌స్ట్రీట్‌ (చిరు వ్యాపారుల ఉపాధి)ను కొన్ని సాంకేతిక కారణాలతో మూసివేయడంతో మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. తాత్కాలికంగా మూసి వేసినప్పటికీ చిరు వ్యాపారులు గత నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫాస్ట్‌పుడ్‌, టిఫిన్‌, ఇతర తినుబండారాల బండ్లు మెక్లారిన్‌ స్కూల్‌ ప్రహరీ చేర్చి ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈట్‌స్ట్రీట్‌ ప్రదేశంలో మరికొన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత యఽథావిధిగా చిరువ్యాపారులకు ఉపాధి కల్పించనున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.  Read more