రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్‌రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తాడా

ABN , First Publish Date - 2022-12-13T01:30:33+05:30 IST

రోడ్లపై పడిన గోతులు కూడా పూడ్చలేని జగన్‌రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. వేమగిరి సామర్లకోట కెనాల్‌ రోడ్డు దుస్థితిని నిరశిస్తూ సోమవారం అనపర్తిలోని గ్యాస్‌ గొడౌన్‌ సమీపంలో పార్టీ శ్రేణులతో కలిసి కెనాల్‌ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్‌రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తాడా

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

  • వేమగిరి-సామర్లకోట రోడ్డు దుస్థితిపై నిరసన

అనపర్తి, డిసెంబరు 12: రోడ్లపై పడిన గోతులు కూడా పూడ్చలేని జగన్‌రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. వేమగిరి సామర్లకోట కెనాల్‌ రోడ్డు దుస్థితిని నిరశిస్తూ సోమవారం అనపర్తిలోని గ్యాస్‌ గొడౌన్‌ సమీపంలో పార్టీ శ్రేణులతో కలిసి కెనాల్‌ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మా ట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం మినహా ప్రజలకు ఉపయోగపడిందేమీ లేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రతిప క్షంలో ఉండగా రోడ్డు నిర్మాణం కోసం పాదయాత్రలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మూడున్నరేళ్లుగా కెనాల్‌ రోడ్డు నిర్మాణానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన రోడ్డుకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీకి వినతి పత్రం ఇవ్వడం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. ఇప్పటికైనా కెనాల్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా లని డిమాండ్‌ చేశారు. ఇప్పటికి రెండు సార్లు తూతూ మంత్రంగా మరమ్మ తులు చేశారని, పనులు కనీసం నెల రోజులు కూడా నిలవలేదన్నారు. ఇటీవల మరమ్మతులు చేపట్టి అక్కడక్కడా ప్రజల కంటితుడుపు చర్యగా గోతులు పూడ్చారని అనపర్తి ఐఎల్‌టీడీ ప్ర్లెఓవర్‌ బ్రిడ్జి నుంచి మూడు తూముల వర కు రోడ్డు మరీ అధ్వానంగా తయారై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా పాలకులకు కనిపించడం లేదన్నారు. కాగా రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. కార్యక్రమంలో సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరా మారెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, చిర్ల గంగిరెడ్డి, పడాల ఆదినారాయణరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, మేడపాటి అన్నవరం, ఒంటిమి సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:31:02+05:30 IST