పోలీసులమని చెప్పి బైక్‌ దొంగతనం..ముగ్గురికి జైలు

ABN , First Publish Date - 2022-05-18T06:47:45+05:30 IST

పోలీసులమని చెప్పి ఒక వ్యక్తి నుంచి బైక్‌ దొంగిలించిన నేరం రుజువు కావడంతో ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు.

పోలీసులమని చెప్పి బైక్‌ దొంగతనం..ముగ్గురికి జైలు

కొవ్వూరు, మే 17 : పోలీసులమని చెప్పి ఒక వ్యక్తి నుంచి బైక్‌ దొంగిలించిన నేరం రుజువు కావడంతో ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు. 2021 మే 28వ తేదీన కొవ్వూరు మండలం కాపవరంలో గోవర్ధనగిరిమెట్ట సమీపంలో పోలీసులమని చెప్పి ఒక వ్యక్తినుంచి బైక్‌ దొంగిలించిన నేరంపై షేక్‌ మొహీద్దీన్‌ ఆలీ, అడపా ఆనంద్‌కుమార్‌, ఉర్ల దుర్గాప్రసాద్‌లపై కొవ్వూరు రూరల్‌ పోలీస్టేసన్‌లో అప్పటి ఎస్‌ఐ కె.రామకృష్ణ కేసు నమోదు చేశారు. మంగళవారం  రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వాదనలు విన్న తరువాత ముద్దాయిల నేరం రుజువు కావడంతో షేక్‌ మొహీద్దీన్‌ ఆలీ, అడపా ఆనంద్‌కుమార్‌లు ఇద్దరికి రెండేళ్ల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.1000లు జరిమానా, ఉర్ల దుర్గాప్రసాద్‌కు 6 నెలల సాదారణ జైలు శిక్ష, రూ. 1000లు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్‌  కె.శారదాంబ తీర్పు చెప్పారు. 

 

Read more