సముద్ర జలాల్లో ముమ్మరంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌

ABN , First Publish Date - 2022-04-24T06:58:51+05:30 IST

కృష్ణా గోదావరి ప్రాజెక్టు పరిధిలోని ఓఎన్జీసీ చమురు, సహజవాయు ఉత్పత్తులు పెంచే దిశలో డ్రిల్లింగ్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసింది.

సముద్ర జలాల్లో ముమ్మరంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌
ఓడలరేవు సముద్ర జలాల్లో డ్రిల్లింగ్‌ పనులు చేస్తున్న అబాన్‌-2 రిగ్‌

 డ్రిల్లింగ్‌ ద్వారా వచ్చే రసాయనిక వ్యర్థాలు సముద్ర జలాల్లోకి

మత్స్య సంపదకు చాలా నష్టమని మత్స్యకారుల ఆందోళన

అల్లవరం,ఏప్రిల్‌ 23: కృష్ణా గోదావరి ప్రాజెక్టు పరిధిలోని ఓఎన్జీసీ చమురు, సహజవాయు ఉత్పత్తులు పెంచే దిశలో డ్రిల్లింగ్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. భూఉపరితలంపైనా, సముద్ర జలాల్లో పలు బావుల ద్వారా ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థలు చమురు, సహజవాయు ఉత్పత్తులను గణనీయంగా వెలికి  తీస్తున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో సముద్ర జలాల్లో గత కొద్దినెలలుగా అబాన్‌-2 రిగ్‌ ద్వారా ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు కొనసాగి స్తోంది. ఈ బావిలో చమురు, సహజవాయు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని ఓఎన్జీసీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువులకు డిమాండు పెరగడంతో కొత్త బావుల అన్వేషణపై ఓఎన్జీసీ దృష్టి  సారించింది. ఓఎన్జీసీ భగీరథ ప్రయత్నం ఫలిస్తే మరింతగా ఉత్పత్తులు పెరు గుతాయని, ఆ దిశలో డ్రిల్లింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఈ అన్వేషణ సందర్భంగా సముద్ర డ్రిల్లింగ్‌ రిగ్‌ల వద్ద వచ్చే రసాయనిక వ్యర్థాలు సముద్ర జలాల్లో వదిలేయడంతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని మత్స్యకారు లు ఆరోపిస్తున్నారు. రిగ్‌ల వద్ద రసాయనిక వ్యర్థాలను భూమికి తెచ్చి దిగు మతి చేయకుండా సముద్రంలోనే వదిలేయడంతో మత్స్యసంపద నశించి పోతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేపల బోట్ల ద్వారా సముద్ర జలాల్లో వేటాడినా రొయ్యలు, చేపలు పడడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కోనసీమ సముద్ర జల్లాల్లో సుమారు 78కుపైగా ఓఎన్జీసీ బావులతోపాటు రిల యన్స్‌కు చెందిన బావులున్నాయి. కేంద్రం వీటిపై దర్యాప్తు జరపాలని, మత్స్య సంపదకు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. 




Updated Date - 2022-04-24T06:58:51+05:30 IST