143 జీవోపై ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల

ABN , First Publish Date - 2022-07-24T21:47:31+05:30 IST

Rajamandry: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమావేశం రాజమండ్రిలో జరిగింది. 26 జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 143 జీవోపై వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం తమతో

143 జీవోపై ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే :  వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల

Rajamandry:  వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల (Health Departement Employers meetting) సమావేశం రాజమండ్రిలో జరిగింది. 26 జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 143 జీవోపై వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.


వైద్య ఆరోగ్య శాఖలో 143 జీవో ఆందోళన కలిగిస్తోంది. పీహెచ్‌సీలో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ముఖ్యంగా పర్యవేక్షక పోస్టులకు మంగళం పలకనుంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న హెల్త్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లపై వేటు పడనుంది. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌నర్సుల ను తప్పనిసరి చేయడం కొన్ని ఆస్పత్రులకు లాభిస్తుంది. ఏజెన్సీలో అసలు డాక్టర్లే లేని ఆస్పత్రులు ఉన్నాయి. అటువంటి ఆస్పత్రులకు తాజా నిర్ణయంతో మేలు జరగనుంది.  అదే సమయంలో మిగతా ఉద్యోగులపై పనిభారం పెరగనుంది.

Read more