అన్నదాన సత్రాన్ని అన్యాయంగా కూల్చేశారు

ABN , First Publish Date - 2022-12-12T01:08:14+05:30 IST

దాతలు అందించిన అన్నదాన సత్రాన్ని అన్యాయంగా కూల్చేశారని ఆర్యవైశ్యసంఘ నాయకులు ఆందోళన చేపట్టారు.

అన్నదాన సత్రాన్ని అన్యాయంగా కూల్చేశారు

ముక్కామలలో ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆందోళన

అంబాజీపేట, డిసెంబరు 11: దాతలు అందించిన అన్నదాన సత్రాన్ని అన్యాయంగా కూల్చేశారని ఆర్యవైశ్యసంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ముక్కామలలో 95ఏళ్ల క్రితం బచ్చు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలోఅన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. బచ్చు ఫౌండేషన్‌ ద్వారా దీనిని ప్రస్తుతం ముక్కామలకు చెందిన బచ్చు శంకరగుప్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా శనివారం అర్ధరాత్రి ఎక్స్‌కవేటరుతో పాటు అక్కడ ఉన్న మహత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, బచ్చు విశ్వనాఽథం విగ్రహాలను తొలగించారని శంకరగుప్తా ఆరోపించారు. జిల్లాలోని ఆర్యవైశ్య సంఘ నాయకులు ముక్కామల చేరుకుని సత్రాన్ని కూల్చివేసి, విగ్రహాలను మాయం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవనాన్ని తక్షణం నిర్మించి విగ్రహాలను యథాస్థానంలో ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కంచర్ల వెంకట్రావు (బాబి) హెచ్చరించారు.

Updated Date - 2022-12-12T01:08:14+05:30 IST

Read more