నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-11-25T01:07:46+05:30 IST

సాగరమాల కార్యక్ర మం కింద కాకినాడ యాంకరేజ్‌ పోర్టు కార్గో ఎగుమతు ల వార్షిక సామర్ధ్యాన్ని 3 మిలియన్‌ టన్నుల స్థాయికి పెంచేందుకు మంజూరైన రూ.91కోట్ల నిధులతో పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు పరిశ్రమలశాఖా మంత్రి గుడివాడ అమరనాథ్‌ శుక్రవా రం ఉదయం యాంకరేజ్‌ పోర్టులో శంకుస్థాపన చేయ నున్నారు.

నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

కాకినాడ సిటీ, నవంబరు 24: సాగరమాల కార్యక్ర మం కింద కాకినాడ యాంకరేజ్‌ పోర్టు కార్గో ఎగుమతు ల వార్షిక సామర్ధ్యాన్ని 3 మిలియన్‌ టన్నుల స్థాయికి పెంచేందుకు మంజూరైన రూ.91కోట్ల నిధులతో పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు పరిశ్రమలశాఖా మంత్రి గుడివాడ అమరనాథ్‌ శుక్రవా రం ఉదయం యాంకరేజ్‌ పోర్టులో శంకుస్థాపన చేయ నున్నారు. యాంకరేజ్‌ పోర్టులో రెండు మెకానికల్‌ కార్గో హ్యోండ్లింగ్‌ వార్ఫ్‌లు, న్యూపోర్టు ఏరియాలో ఐదు అద నపు లోడింగ్‌ పాయింట్‌ల నిర్మాణం, పోర్టు అనుబంధ అంతర్గత రహదార్ల అభివృద్ధి, కమర్షియల్‌ కెనాల్‌ గ్రోయిన్లు, రివిట్‌మెంట్ల మరమ్మతులు, కమర్షియల్‌, అప్రోచ్‌ కెనాల్‌ల డ్రెడ్జింగ్‌ పనులను చేపట్టనున్నారు. రానున్న 12నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. ఈ పనుల నిర్వహణకు మెషర్స్‌ విశ్వసముద్ర హోల్డింగ్స్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

కర్యం

Updated Date - 2022-11-25T01:07:48+05:30 IST