పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-04-24T07:18:08+05:30 IST

ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకూ నిర్వహించే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసినట్లు మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీనివాస్‌ శనివారం తెలిపారు.

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఎంఈవో శ్రీనివాస్‌

బిక్కవోలు, ఏప్రిల్‌ 23: ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకూ నిర్వహించే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసినట్లు మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. మండలంలో పది ఉన్నత పాఠశాలలకు మూడుచోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో  బిక్కవోలు, ఇళ్లపల్లి, నేతాజీ శ్రీవిద్యానికేతన్‌, సూర్యతేజ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి 232 మంది విద్యార్థులు, బలభద్రపురం కేంద్రంలో బలభద్రపురం, కాపవరం నుంచి 119 మంది విద్యార్థులు,  పందలపాక పరీక్షా కేంద్రంలో పందలపాక, కొంకుదురు నుంచి 181 మం ది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. మండలంలోని మెళ్లూరు ఉన్నత పాఠశాల నుంచి 27 మంది విద్యార్థులు, ఊలపల్లి ఉన్నత పాఠశాల నుంచి 59 మంది విద్యార్థులు పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి హాజరవుతారన్నారు. మండలంలోని మూడు పరీక్షా కేంద్రాలకు 45 మంది ఇన్విజిలేటర్లను, ముగ్గురు డీవోలను, ముగ్గురు చీఫ్‌ సూపరింటెండెంట్‌లను నియమించామని ఎంఈవో  శ్రీనివాస్‌ వివరించారు. Read more