ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై నిరసన

ABN , First Publish Date - 2022-11-16T01:14:51+05:30 IST

విద్యార్థులను కొట్టారన్న కారణంతో ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడాన్ని తప్పుపడుతూ యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం కరపలో నిరసన తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కరప హైస్కూల్‌ ఉపాధ్యాయుడు వి.వెంకటగంగాధర్‌పై పడిన సస్పెన్సన్‌ వేటును తక్షణం రద్దుచేయాలని కో

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై నిరసన
కరపలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

కరప, నవంబరు 15: విద్యార్థులను కొట్టారన్న కారణంతో ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడాన్ని తప్పుపడుతూ యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం కరపలో నిరసన తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కరప హైస్కూల్‌ ఉపాధ్యాయుడు వి.వెంకటగంగాధర్‌పై పడిన సస్పెన్సన్‌ వేటును తక్షణం రద్దుచేయాలని కోరారు. విద్యార్థలు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు లేకపోయినా, విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోయినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ఉపాధ్యాయలోకాన్ని చులకన చేసేలా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పం దించి వెంటనే సదరు ఉపాధ్యాయుడి సస్పెన్సన్‌ ఉత్తర్వులు ఎత్తివేయాలని లేకపోతే జిల్లాస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు పి.రాజబాబు, ప్రధాన కార్యదర్శి టి.శ్రీరామ్‌, టీఎ స్‌వీఎస్‌ నారాయణ, గౌరవాధ్యక్షుడు వడ్డి వెంక టేశ్వరరావు, ఐ.ప్రసాదరావు, ఎం.రామకృష్ణ, కె. వీర్రాజు, కె.సూర్యానందకుమార్‌, మారిశెట్టి శ్రీరామచంద్రమూర్తి, కేవీ రమణ, ప్రసన్నకుమారి, శ్రీలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T01:14:51+05:30 IST

Read more