టీడీపీతోనే శెట్టిబలిజ సంక్షేమం సాధ్యం

ABN , First Publish Date - 2022-11-17T01:42:15+05:30 IST

తెలుగుదేశం పార్టీతోనే శెట్టిబలిజల సంక్షేమం సాధ్యమని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.

టీడీపీతోనే శెట్టిబలిజ సంక్షేమం సాధ్యం

కడియం, నవంబరు 16: తెలుగుదేశం పార్టీతోనే శెట్టిబలిజల సంక్షేమం సాధ్యమని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. బీసీ సాధికారసమితి శెట్టిబలిజ రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు అధ్యక్షతన వేమగిరిలో బుధవారం టీడీపీ శెట్టిబలిజ సాధికార సర్వసభ్య సమావేశం జరిదింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ పరిధిలో టీడీపీ విజయం వెనుక శెట్టిబలిజల కృషి ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు గుర్తింపు తెచ్చింది చంద్రబాబే అన్నారు. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహించేలా పనిముట్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో శెట్టిబలిజలు మరింత ప్రగతిని సాధిస్తారని అందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు దాటినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదీలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం చేతకాక, టీడీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ నిధులను కూడా దారిమళ్ళించే దుస్థితిలో పాలన ఉందన్నారు. కుడుపూడి సత్తిబాబుకి టీడీపీ పార్టీ అఽదిష్టానం ఇచ్చిన బాధ్యతలను రాష్ట్రం మొత్తం తిరుగుతూ శెట్టిబలిజ వర్గ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అభినందించారు. కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన రామచంద్రపురంలో జరిగే శెట్టిబలిజ సాధికారిత సమితి కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శెట్టిబలిజలు అంతా హాజరై ఐక్యతను చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్‌ ప్రదాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనువాసు, రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిత సమితి సభ్యులు మునసా అప్పారావు, జిల్లా బీసీసెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, కన్వీనర్‌ జోగి చక్రవర్తి, ధవళేశ్వరం మాజీ సర్పంచ్‌ పిన్నింటి ఏకబాబు, గుత్తుల కృష్ణ, టీడీపీ శెట్టిబలిజ నాయకులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T01:42:17+05:30 IST