ఎన్టీఆర్‌ పేరే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-28T05:49:03+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన అమలాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం గడియార స్తంభం సెంటర్లో ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ పేరే కొనసాగించాలి
గడియార స్తంభం సెంటర్లో రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు

  • కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నాలుగు రోజుల రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నేతలు

అమలాపురం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన అమలాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం గడియార స్తంభం సెంటర్లో ప్రారంభించారు. టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ ఆధ్వర్యంలో తొలి రోజు శిబిరంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, నాయకులు పరమట శ్యామ్‌, చిక్కాల గణేష్‌, పెచ్చెట్టి చంద్రమౌళి, బత్తుల సాయి, మాకిరెడ్డి పూర్ణిమ, మద్దాల అనురాజేశ్వరి, మహిళా విభాగం అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, టీఎన్టీయూసీ అధ్యక్షుడు కుసుమ సూర్యమోహనరావు, పటణ శాఖ అధ్యక్షుడు వలవల శివరావు, గెల్లా మీనాకుమారి, పేరూరి విజయలక్ష్మి, భాస్కర్ల రామకృష్ణ, నల్లా మల్లిబాబు, మల్లుల పోలయ్య, నల్లా చిన్నా, బోనం సత్తిబాబు, చింతలపూడి సత్తిబాబుతో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన కుట్రపూరితంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడం దారుణమన్నారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు హెచ్చరించారు. జగన ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలపై నాయకులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

Read more