ఏసీ గదుల్లో కాదు.. చేలకు రండి..

ABN , First Publish Date - 2022-11-25T00:55:11+05:30 IST

ప్రభుత్వ నిబంధనలు సడలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మద్ది పాటి వెంకట్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఏసీ గదుల్లో కాదు.. చేలకు రండి..
దేవరపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకుల రైతు పోరు

గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వినతి

దేవరపల్లి, నవంబరు 24 : ప్రభుత్వ నిబంధనలు సడలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మద్ది పాటి వెంకట్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం నుంచి దుద్దుకూరు వరకు సర్వీసు రోడ్డు వెంబడి ఉన్న ధాన్యం కళ్లేలను గురువారం పరిశీలిస్తూ పాదయాత్ర చేశారు. దీనిలో భాగంగా రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలు ఇస్తే రైతుల బాధలేం అర్ధమ వుతాయి.. ఒకసారి పొలం బాట పట్టాలని సూచిం చారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఆర్‌బీకేల్లో ధాన్యం కోనుగోళ్లు సాగ డం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఎకరానికి 35 బస్తాలు చొప్పున కొనుగోలు చేస్తుందని.. ఎకరానికి 40 నుంచి 45 బస్తాలు పండించిన రైతు ఏమై పోతాడన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా నట్టేట ముంచిందన్నారు. ఇకనైనా వైసీపీ అగ్రనాయకులు మత్తునిద్ర వదిలి కళ్లేల్లో ఉన్న ధాన్యం కొనుగోలుకు నిబంఽధలు సడలించాలన్నారు. రైతు కన్నీరుపెట్టుకుంటే రాష్ర్టానికి శ్రేయస్కరం కాదన్నారు. ధాన్యాన్ని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే జాతీయ రహదారిని దిగ్భంధం చేస్తా మన్నారు.అనంతరం ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి శ్రమదానం చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు.ఈ కార్య క్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆండ్రూ అనిల్‌,టీడీపీ నేతలు గన్నమని హరికృష్ణ, ముళ్ళ పూడి దొరాజీ, కాట్రు భీమరాజు, కొండపల్లి దొరయ్య, పాకలపాటి గాంధీ, దేవరపల్లి వీరాస్వామి చౌదరి, లంకా సత్యనారాయణ, శ్రీనివాస్‌, జమ్ముల సతీష్‌, యద్ధనపూడి బ్రహ్మరాజు, ఉప్పులూరి రాంబాబు, బిక్కిన నాగరాజు, నీలి శరత్‌,పి.రతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:55:14+05:30 IST