‘సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి’

ABN , First Publish Date - 2022-11-17T00:50:23+05:30 IST

నిబంధనలను పక్కన పెట్టి మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలిసి బుధవారం ఆయన మండలంలోని యండమూరు, వలసపాకల, కరప

‘సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి’

కరప, నవంబరు 16: నిబంధనలను పక్కన పెట్టి మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలిసి బుధవారం ఆయన మండలంలోని యండమూరు, వలసపాకల, కరప గ్రామాల్లో పలువురు రైతులతో మాట్లాడారు. జిల్లాలో 60శాతం మసూళ్లు పూర్తయినా ప్రభుత్వం ధాన్యం కొనడంలేదని ఆరోపించారు. కొత్త విధానంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి కమీషన్లు, కోతలు లేకుండా గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలుచేయాలని, లేకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:50:24+05:30 IST