టీడీపీ హయాంలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం

ABN , First Publish Date - 2022-09-11T06:46:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు అన్నారు.

టీడీపీ హయాంలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం

అంబాజీపేట, సెప్టెంబరు 10: తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు అన్నారు. టీడీపీ అధినేత  చంద్రబాబు, భువనేశ్వరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మందపాటి కిరణ్‌కుమార్‌అనితా సమకూర్చిన చీరలను ఇసుకపూడిలో మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, పార్టీ మండల కార్యదర్శి గుడాల ఫణి, నాయకులు దాసరి వీరవెంకట సత్యనారాయణ, బొంతు పెదబాబు, గుమ్మడి నాగమణి, పబ్బినీడి రాంబాబు, గుబ్బల శ్రీనివాసరావు, బొక్కా రుక్మిణి తదితరలు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దంతులూరి శ్రీనురాజు ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లియ్య ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిన్నం బాలవిజయరావు, నాగాబత్తుల సుబ్బారావు పాల్గొన్నారు.

Read more