టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ABN , First Publish Date - 2022-03-16T06:41:16+05:30 IST

టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషిచేయాలని టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌ కోరారు.

టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

మామిడికుదురు, మార్చి 15: టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషిచేయాలని టీడీపీ మండలశాఖ  అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌ కోరారు. పాశర్లపూడిలో మంగళ వారం నిర్వహించిన టీడీపీ గౌరవ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బోనం బాబు, సూదా బాబ్జి, ఈలి శ్రీనివాస్‌, మదాల కృష్ణ మూర్తి, కొండా జగదీష్‌, కొల్లాబత్తుల వెంకటరమణ, దొంగ సత్యనారాయణ, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, గంధం భాస్కర్‌, మార్లపూడి నాగేశ్వర రావు, తోట పెద్దబ్బులు తదితరులు పాల్గొన్నారు. Read more