టీబీ బాధితులను దత్తత తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-13T01:29:09+05:30 IST

జిల్లాలో టీబీ వ్యాధితో చికిత్స పొందుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందజేయడానికి ని-క్షయ్‌ మిత్ర ద్వారా దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కోరారు. రాజమహేంద్రవరం (బొమ్మూరు) కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో ని-క్షయ్‌ మిత్ర కింద నలుగురిని దత్తత తీసుకున్నారు.

టీబీ బాధితులను దత్తత తీసుకోవాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 12: జిల్లాలో టీబీ వ్యాధితో చికిత్స పొందుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందజేయడానికి ని-క్షయ్‌ మిత్ర ద్వారా దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కోరారు. రాజమహేంద్రవరం (బొమ్మూరు) కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో ని-క్షయ్‌ మిత్ర కింద నలుగురిని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలన చేసే దిశలో వ్యాధిగ్రస్తులకు పోషక విలువలతో కూడిన మంచి ఆహారం అందజేయాల్సి ఉందని అన్నారు. జిల్లాలో సుమారు 1400 మంది క్షయ బాధితులు ఉన్నారని, వారిలో ఇప్పటి వరకూ 378 మందిని దత్తత తీసుకున్నారని తెలిపారు. జిల్లా క్షయ నిర్మూలనాధికారి డాక్టర్‌ ఎన్‌.వసుందర మాట్లాడుతూ ప్రతి టీబీ పేషెంట్‌ క్రమం తప్పకుండా మందులు వాడాలని అన్నారు. జిల్లాను టీబీ రహితంగా చేద్దామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎస్‌జీటీ సత్యగోవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:29:11+05:30 IST