నే ఇద్దరు టీబీ రోగులను దత్తత తీసుకున్నా.. మీరూ ని-క్షయ్‌ మిత్రలుగా రండి

ABN , First Publish Date - 2022-11-17T01:13:04+05:30 IST

జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహక రించాలని కలెక్టర్‌ కె.మాధవీలత సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్‌, తదితర శాఖల అధికారులతో ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌పై సమీక్షించారు

నే ఇద్దరు టీబీ రోగులను దత్తత తీసుకున్నా..  మీరూ ని-క్షయ్‌ మిత్రలుగా రండి

బొమ్మూరు, నవంబరు 16: జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహక రించాలని కలెక్టర్‌ కె.మాధవీలత సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్‌, తదితర శాఖల అధికారులతో ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌పై సమీక్షించారు.టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో కమ్యూనిటీ వాటాదారులను ఏకతాటిపైకి తీసురావడం సమావేశం ముఖ్యోద్దేశ మన్నారు.టీబీ బారిన పడిన వారికి తగిన పౌష్టికాహారం, మందులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావాలని కోరారు. కనీసం ఒక్కరినైనా దత్తత తీసుకుని వారికి సేవలందించాలన్నారు.రోగులకు సేవచేయాలి అనుకునే వ్యక్తులు, సంస్థలు ముందుగా ని-క్షయ్‌ మిత్రలుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి చేయూత ఇస్తామని తెలిపారు. దాని ద్వారా బ్లాక్‌లు, జిల్లాలు, వ్యక్తిగత రోగిని దత్తత తీసుకోవచ్చన్నారు. తన వంతుగా ఇద్దరు టీబీ రోగులను దత్తత తీసుకున్నానని కలెక్టర్‌ తెలిపారు.టీబీ నియంత్రణ అధికారి డా.ఎన్‌.వసుంధర మాట్లాడుతూ జిల్లాలో సుమారు 850 మంది రోగులు ఉన్నారన్నారు.46 మంది ని-క్షయ్‌ మిత్ర లుగా నమోదు చేసుకుని 122 మంది వ్యక్తుల బాధ్యత తీసుకున్నారన్నారు. ని-క్షయ్‌ మిత్రలుగా పేర్లు నమోదు,సమాచారానికి 94922 97887 నెంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. ప్రతి నెల రూ.500 అందించడం ద్వారా టీబీ సోకిన వారికి ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం చేయడం కోసం పేర్లను నమోదు చేసు కోవాలని కోరారు.డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T01:13:04+05:30 IST

Read more