నేడు డీఆర్‌సీ, నీటిపారుదల సలహా మండలి సమావేశాలు

ABN , First Publish Date - 2022-05-18T07:17:25+05:30 IST

జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ), నీటిపారుదల సలహా కమిటీ సమావేశాలు స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

నేడు డీఆర్‌సీ, నీటిపారుదల సలహా మండలి సమావేశాలు

ఇన్‌చార్జి మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత రాక

రాజమహేంద్రవరం, మే 17 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ), నీటిపారుదల సలహా కమిటీ సమావేశాలు స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీనికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసంబంధాల, వెనుకబడిన తరగతుల సం క్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కె.మాధవీలత, ఇతర జిల్లా అధికారులు పాల్గొంటారు. దీని ప్రారంభ సమయంలో ఫోటోలు, వీడియోలకోసం 5 నిమిషాలు మాత్రం మీడియా ప్రతినిధులను అనుమతిస్తామని, సహకరించాలని సమాచారశాఖ ఒక ప్రకటనలో కోరింది.Read more