అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-31T06:28:50+05:30 IST

సామర్లకోట, ఆగస్టు 30: పట్టణ శివారు అక్షయ లక్ష్మీనందన కాలనీ లో ఆర్‌.సత్యనారాయణ (55) తన ఇంటిలోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. సత్యనారాయణ స్థానిక ఒక ప్రైవేట్‌ చిట్‌ కంపెనీలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు, కుటుంబ సభ్యులతో కలిసి అక్షయ నందన్‌ కాలనీలో

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సామర్లకోట, ఆగస్టు 30: పట్టణ శివారు అక్షయ లక్ష్మీనందన కాలనీ లో ఆర్‌.సత్యనారాయణ (55) తన ఇంటిలోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. సత్యనారాయణ స్థానిక ఒక ప్రైవేట్‌ చిట్‌ కంపెనీలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు, కుటుంబ సభ్యులతో కలిసి అక్షయ నందన్‌ కాలనీలో నివసిస్తున్నట్టు సమాచారం. సోమవారం రాత్రి తన గదలో నిద్రించిన సత్యనారాయణ మంగళవారం ఉదయం లేవకపోవడంతో తలుపులు తెరిచి చూడగా మంచంపై అనుమానాస్పదంగా మృ తిచెందిఉన్నాడు. సామర్లకోట ఎస్‌ఐ టీ సునీత సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి బావమరిది అయిన సబ్బరపు రాం బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు నమోదు చేసారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం పెద్దాపురం తరలించారు.


Read more