-
-
Home » Andhra Pradesh » East Godavari » sucide attempt-NGTS-AndhraPradesh
-
బలవంతపు భూసేకరణపై రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-09-08T06:31:39+05:30 IST
పేదల భూములను బలవంతంగా లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిం చడంతో ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అనపర్తి, సెప్టెంబరు 7 : పేదల భూములను బలవంతంగా లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిం చడంతో ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో ల్యాండ్ సీలింగ్ ద్వారా మిగిలిన భూము లను 1990 ప్రాంతంలో సుమారు 30 మంది రైతు లకు ఎకరా చొప్పున పట్టాలు ఇచ్చారు. అయితే నాటి నుంచి నేటి వరకు వారు ఆ భూములను పండించు కుంటున్నారు. ఇటీవల పట్టాలు ఇచ్చిన భూములు ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటాయని వెనక్కి తిరిగి ఇవ్వాలని అధికారులు,ప్రజా ప్రతినిధులు కోరగా రైతులు వ్యతిరేకించారు.అయినా బుధవారం అధికా రులు ఆ భూములను పరిశీలించేందుకు వచ్చారు. తాము భూమిని నమ్ముకుని బతుకుతు న్నామని అమ్ముకోలేమని పేదలకు ఇవ్వడానికి మరెక్కడైనా భూ మిని సేకరించాలని రైతులు కోరారు.అయినా పట్టించు కోకుండా భూమిలో అధికారులు జెండాలు పాతడంతో తమకు ఇక భూమి మిగలదనే ఆవేదనతో రైతు దమ్ము శివ అధికారుల ఎదుటే పురుగుల మందు సేవించి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధు వులు,స్థానికులు శివను బిక్కవోలులోని ప్రైవేటు ఆసు పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు చేరుకుని బాధితుడిని పరామర్శించారు.