విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-08-17T06:00:29+05:30 IST

ఏలేశ్వరం, ఆగస్టు 16: మండలంలోని జె.అన్నవరం గ్రామానికి చెందిన దంతులూరి లక్ష్మీసౌమ్య (21) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసా

విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు

ఏలేశ్వరం, ఆగస్టు 16: మండలంలోని జె.అన్నవరం గ్రామానికి చెందిన దంతులూరి లక్ష్మీసౌమ్య (21) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. లక్ష్మీసౌమ్య ఏలేశ్వరంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఈనెల 4న ఆమె పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం ఇంటినుంచి కళాశాలకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ంది. తిరిగి చేరుకోకపోవడంతో లక్ష్మీసౌమ్య సోదరుడు విజయదుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. 

Read more