విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-12-12T01:01:04+05:30 IST

నవ్య సమాజంవైపు ముందుకు సాగాలంటే విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్ప థాన్ని పెంపొందించుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పిలుపు నిచ్చారు.

విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 11: నవ్య సమాజంవైపు ముందుకు సాగాలంటే విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్ప థాన్ని పెంపొందించుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పిలుపు నిచ్చారు. ఎందుకు, ఏమిటి, ఎలా... తెలుసుకోవడం అలవర చుకోవాలని సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ప్రాంగ ణంలో ఆదివారం కోనసీమ జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు-2022 నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 41 బృందాలు రాగా రాత పరీక్ష, క్విజ్‌ పోటీలు నిర్వ హించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులైన బృందాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ర్యాలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, ప్రైవేటు పాఠశాలల నుంచి అమలాపురం ఎస్పీఆర్‌ఎం బ్లూ ఇంగ్లిషు మీడియం స్కూలు ప్రథమ స్థానం సాధించిందని జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఇఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. విజేతలకు ఎమ్మెల్సీ ఐవీతో పాటు, జేవీవీ అధ్యక్ష, కార్యదర్శులు జె.సత్యనారాయణ, డాక్టర్‌ చల్లా రవికుమార్‌, సి.స్టాలిన్‌, అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, రైల్వే సాధన సమితి నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, సప్పా నాగేశ్వరరావు, కౌన్సిలర్‌ సంసాని బులినాని బహుమతులు, సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. చింతా శ్యామ్‌ జాదూగర్‌ ఆధ్వర్యంలో శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - 2022-12-12T01:01:04+05:30 IST

Read more