గోదావరిలో ఇసుక ర్యాంపు నిర్మాణం ఆపాలని నిరసన

ABN , First Publish Date - 2022-12-30T01:08:57+05:30 IST

కోటిపల్లి గోదావరి నదిలో ఇసుక తవ్వకాల కోసం నిర్మిస్తున్న ర్యాంపు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు.

గోదావరిలో ఇసుక ర్యాంపు నిర్మాణం ఆపాలని నిరసన

కె.గంగవరం, డిసెంబరు 29: కోటిపల్లి గోదావరి నదిలో ఇసుక తవ్వకాల కోసం నిర్మిస్తున్న ర్యాంపు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు. గురువారం కోటిపల్లి మత్స్యకార కాలనీలో నాయకులు సమావేశమై నిరసన తెలిపారు. ర్యాంపు నిర్మాణంతో వేటకు వెళ్లడానికి వీలు ఉండదని, ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో తేదీన చేపట్టే ర్యాంపు ప్రారంభాన్ని అడ్డుకుంటామని హెచ్చ రించారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం నాయకుడు కర్రి చిట్టిబాబు, యాట్ల నాగేశ్వరరావు, పెమ్మాడి మల్లేశ్వరరావు, పాలెపు శ్రీరా ములు, పాలెపు మల్లయ్య, కోటిపల్లి శ్రీను, పామర్తి బాబి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T01:08:57+05:30 IST

Read more