రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం

ABN , First Publish Date - 2022-08-17T06:24:01+05:30 IST

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం

మలికిపురం, ఆగస్టు 16: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. లక్కవరంలో ఎంజీ గార్డెన్స్‌లో జరిగిన రాజోలు నియోజకవర్గ క్లస్టర్లు, యూనిట్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కమిటీ కన్వీనర్ల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎన్నికల ప్రక్రియలో బూత్‌ కమిటీల పాత్ర చాలా ప్రముఖమైనదన్నారు. నియోజకవర్గ పరిశీలకునిగా వచ్చిన చిటికెల రామ్మోహనరావు మాట్లాడుతూ రాజోలు నియోజకవ ర్గంలో సెక్షన్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కమిటీ కన్వీనర్లగా 820 మంది నియమితులయ్యారని, వీరంతా సైనికుల వలే పనిచే యాలన్నారు. ప్రజలంతా చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని వారు అన్నారు. రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, రాష్ట్ర టీడీపీ మహిళా కార్యదర్శి మంగెన భూదేవి, రాష్ట్ర ఎస్సీసెల్‌ అఽధికార ప్రతినిధి గెడ్డం సింహా, అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి చెల్లింగి అబ్బులు, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్‌, గుబ్బల శ్రీనివాస్‌, రాపాక నవరత్నం, చాగంటి స్వామి, ఈలి శ్రీనివాస్‌, అడబాల రమాదేవి, పిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Read more