రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

ABN , First Publish Date - 2022-11-23T00:31:15+05:30 IST

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు కొవ్వూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయినట్టు డీవైఈవో, పాఠశాల హెచ్‌ఎం ఎం.తిరుమలదాసు తెలిపారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

కొవ్వూరు/చాగల్లు, నవంబరు 22: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు కొవ్వూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయినట్టు డీవైఈవో, పాఠశాల హెచ్‌ఎం ఎం.తిరుమలదాసు తెలిపారు. ఈ నెల 19న భీమడోలులో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరపున ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌-14 విభాగంలో టి.తేజశ్రీ, టి.సుష్మిత, యు.హేమవర్షిత, అండర్‌-17 విభాగంలో పి.సూర్యవైష్ణవి, ఎండీ ఆరీఫా యాస్మిన్‌ ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం తిరుమలదాసు, పీఈటీ ఎస్‌.భాస్కర్‌, విద్యా కమిటి చైర్మన్‌ పి.కవిత, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే చాగల్లు జడ్పీ హైస్కూల్‌ నుంచి అండర్‌-14 విభాగంలో జోత్స్న, జ్యోష్నవి, అన్నపూర్ణ ఎంపికయ్యారు. పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థు లను ప్రధానోపాధ్యాయుడు పి.వీర్రాజు, వ్యాయామోపాధ్యాయులు విజయలక్ష్మి, సుధాకర్‌, ముని, ప్రేమ్‌చంద్ర సహా పలువురు అభినందించారు.

Updated Date - 2022-11-23T00:31:15+05:30 IST

Read more