జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారం

ABN , First Publish Date - 2022-07-18T07:07:53+05:30 IST

జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంగా మారనుం దని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారం

అనపర్తి, జూలై 17: జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంగా మారనుం దని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెరిగిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని లక్ష్మీనరసాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ధరల పెంపుపై ముద్రించిన కరపత్రాలను పంచుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకటరామారెడ్డి,  ఒం టిమి సూర్యప్రకాష్‌, నూతిక బాబూరావు, భరతుడు, శ్రీనురాజు పాల్గొన్నారు.

Read more