రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-03-04T06:46:14+05:30 IST

రాష్ట్రంలో మాజీముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు పాలన కోసం ప్ర జలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి గొల్లప ల్లి సూర్యారావు అన్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోసం ఎదురుచూపు

మాజీమంత్రి గొల్లపల్లి

రాజోలు, మార్చి 3: రాష్ట్రంలో మాజీముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు పాలన కోసం ప్ర జలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి గొల్లప ల్లి సూర్యారావు అన్నారు. కడలిలో గురువారం జరిగిన టీడీపీ గౌరవసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడు తూ సొంత కుటుంబానికి చెందిన చిన్నాన్ననే చంపించిన దుర్మార్గంలో వైసీపీ ప్రభుత్వం ఉందని తీవ్రంగా విమర్శించారు. దేవాలయం వంటి అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చే శారన్నారు. ప్రజల మద్ధతుతో ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత గౌరవసభలో అడుగు పెడతానని అసెంబ్లీ నుంచి చంద్రబాబు బయటికి వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన నడుస్తుందన్నారు. అనంతరం కడలి ఎంపీ టీసీ అంబటి అరుణకుమారి, యల్లమిల్లి రాజేష్‌, బందెల నాగరాజు, పిల్లి జ్యోతిప్రసాద్‌, ఉందుర్తి రాంబాబు, పిల్లి సాయిరామ్‌తో పాటు మరో ఇరవై మంది గొల్లపల్లి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, మంగెన భూదేవి, రాజోలు మండలాధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, బందెల పద్మ, కాండ్రేగుల భవాని, సర్పంచ్‌ కడలి సత్యనారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు. 

రాష్ట్రంలో విధ్వంసకర ప్రభుత్వం నడుస్తోంది

మామిడికుదురు: రాష్ట్రంలో విధ్వంసకర ప్రభుత్వం నడుస్తోందని మాజీమంత్రి గొల్లప ల్లి సూర్యారావు ఆరోపించారు. గురువారం గెద్దాడ గ్రామంలో జరిగిన గౌరవసభలో మాజీ మంత్రి పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ఆనాటి వైభవం ఈనాడు ఏమైపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, ఈలి శ్రీనివాస్‌, వర్థినేని  వెంకట్రామయ్య, చాగంటి స్వామి, గెడ్డం సింహ, విత్తనాల జానకీ రామరావు పాల్గొన్నారు. Read more