ఎస్‌ఈబీ ఏఎస్పీ రమాదేవికి ఎస్పీగా పదోన్నతి

ABN , First Publish Date - 2022-11-24T01:08:37+05:30 IST

ఎస్‌ఈబీ తూర్పుగోదావరి జిల్లా అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న కె.రమాదేవికి ఎస్పీగా పదోన్నతి లభించింది.

ఎస్‌ఈబీ ఏఎస్పీ రమాదేవికి ఎస్పీగా పదోన్నతి
రమాదేవి

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు23: ఎస్‌ఈబీ తూర్పుగోదావరి జిల్లా అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న కె.రమాదేవికి ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్రంలో 20 మంది అడిషనల్‌ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు లభిం చగా అందులో జిల్లా నుంచి రమాదేవి ఉన్నారు. 2020లో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో ఏఎస్పీగా జాయినైన రమాదేవి, అటుపై ఎస్‌ఈబీకి బదిలీ అయ్యారు. ఎస్‌ఈబీ జిల్లా అడిషనల్‌ ఎస్పీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ 1996ను అనుసరించి సీనియార్టీ ప్రకారం కె.రమాదేవికి పదోన్నతి లభించింది. అలాగే ఆమెను ఏసీబీ జాయింట్‌ డైరెక్టరు (ఎక్సైటింగ్‌ వేకెన్సీ)గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

================

Updated Date - 2022-11-24T01:08:37+05:30 IST

Read more