సామాజిక న్యాయం కోరుతూ.. రేపు మాదిగల రాజకీయ చైతన్య మహాసభ

ABN , First Publish Date - 2022-12-10T00:53:45+05:30 IST

సామాజిక న్యాయం కోరుతూ మాదిగ, ఉపకులాల రాజకీయ చైతన్య మహాసభను ఈ నెల 11న అమలాపురం శివారు కొంకాపల్లి సత్తెమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ బొమ్మి ఇజ్రాయిల్‌మాదిగ చెప్పారు.

 సామాజిక న్యాయం కోరుతూ..  రేపు మాదిగల రాజకీయ చైతన్య మహాసభ

అమలాపురం టౌన్‌, డిసెంబరు 9: సామాజిక న్యాయం కోరుతూ మాదిగ, ఉపకులాల రాజకీయ చైతన్య మహాసభను ఈ నెల 11న అమలాపురం శివారు కొంకాపల్లి సత్తెమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ బొమ్మి ఇజ్రాయిల్‌మాదిగ చెప్పారు. అమలాపురం ప్రీతి రెసిడెన్షిలో శుక్రవారం మాదిగ అనుబంధ కులాల జిల్లాస్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది మాదిగ, అనుబంధ కులాల వారు ఉండగా కేవలం ఆరు నుంచి ఎనిమిది మాత్రమే అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీల కు రిజర్వు చేయబడ్డ 29 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాలు మాదిగలకు కేటాయించాలని, నాలుగు ఎంపీ రిజర్వు స్థానా ల్లో రెండు మాదిగ అనుబంధ కులాలకు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానంగా త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ రిజర్వుడు స్థానాల్లో రెండింటిని మాదిగలకు కేటాయించాలని అప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే రాజకీయ చైతన్య మహాసభ కు ఓసీ, బీసీ మైనార్టీలు సైతం సంఘీభావం తెలిపి మహా సభకు హాజరవుతున్నారని వివరించారు. రాజకీయ చైతన్య మహాసభకు వేలాదిగా తరలిరావాలని సీనియర్‌ నాయకుడు మోకాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మహాసభకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావుతోపాటు పలువురు ప్రముఖులు హాజర వుతున్నట్లు తెలిపారు. మాదిగల పొలిటికల్‌ జేఏసీ తరుపున మాత్రమే మహాసభలు నిర్వహిస్తున్నామని, ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలంతోను చేపట్టలేదని వివరించారు. నాయకులు బడు గు శ్రీను, ఉందుర్తి సాయిబాబు, పెదపూడి శ్రీనివాస్‌, ఆకు మర్తి సత్యనారాయణ, చాట్ల విద్యాసాగర్‌, బడుగు సాయి, తొత్తరమూడి హృదయకృష్ణ, చుట్టుగుళ్ల సత్యనారాయణ, కము జు శ్రీను, నవుండ్రు ధన, ఈతకోట చంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:53:47+05:30 IST