బండి.. అంతా పైరవీలేనండి

ABN , First Publish Date - 2022-11-25T01:54:00+05:30 IST

అవి జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు ఇచ్చే మూడుచక్రాల స్కూటీలు.. ఒక్కో వాహనం విలువ రూ.95వేలు.. శారీరకంగా వైకల్యం ఉన్న వారి లో అర్హులను గుర్తించి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్న వాహనాలివి.. ఒక్కో నియోజకవర్గానికి కేవలం పది స్కూటీల చొప్పున వైసీపీ అధి కారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత తొలిసారిగా అమలు చేస్తున్న పథకం ఇది.. ఇప్పుడీ వాహనాలపై జిల్లాలో అధికార పార్టీ నేతలు వా లిపోయారు.

బండి.. అంతా పైరవీలేనండి

  • జిల్లాలో దివ్యాంగుల మూడుచక్రాల స్కూటీల పథకంలో రాజకీయ సిఫార్సుల జోరు

  • చెప్పిన వాళ్లకే ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లు

  • నియోజకవర్గానికి కేవలం పది మంది లబ్ధిదారులకే ఛాన్స్‌: వందల్లో దరఖాస్తులు

  • నేతల ఒత్తిళ్లతో తలపట్టుకుంటున్న అధికారులు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

అవి జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు ఇచ్చే మూడుచక్రాల స్కూటీలు.. ఒక్కో వాహనం విలువ రూ.95వేలు.. శారీరకంగా వైకల్యం ఉన్న వారి లో అర్హులను గుర్తించి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్న వాహనాలివి.. ఒక్కో నియోజకవర్గానికి కేవలం పది స్కూటీల చొప్పున వైసీపీ అధి కారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత తొలిసారిగా అమలు చేస్తున్న పథకం ఇది.. ఇప్పుడీ వాహనాలపై జిల్లాలో అధికార పార్టీ నేతలు వా లిపోయారు. అర్హుల కంటే తమ వాళ్లకే వీటిని మంజూరు చేయాలం టూ ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు మొదలు పెట్టేశారు. సిఫార్సు లేఖలు పంపు తూ, ఫోన్లు చేస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. అర్హతలతో సంబంధం లేకుండా తాము సూచించిన దివ్యాంగులనే పథకానికి ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. సందిట్లో సడేమియా అన్నట్లు నేతల అనుచరులు సిఫార్సుల జాబితా తీసుకుని కొందరు దరఖాస్తు దారులనుంచి అప్పుడే రూ.40వేల వరకు పిండేశారు. రూ.95వేల స్కూటీ ఉచితంగా వస్తుండడంతో సగం తమకు చదివించుకుంటే లబ్ధి దారుల జాబితాలో పేర్లు చేర్చుతామంటూ వసూళ్లు చేసేశారు.

ఎన్ని పైరవీలో..

గత తెలుగుదేశం ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్నిరకాల పథకాలు అమల్లో ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ అటకెక్కించేసింది. దీంతో జిల్లాలో దివ్యాంగుల పరిస్థితి అత్యంత దారు ణంగా తయారైంది. ముఖ్యంగా యుక్తవయస్సు నుంచి మధ్య వయ స్సులో ఉన్న దివ్యాంగులు వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లడానికి కనీ సం ప్రభుత్వం మూడుచక్రాల బైక్‌లను కూడా ఇవ్వడం నిలిపివేసింది. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జగ న్‌ ప్రభుత్వం దివ్యాంగులపై దృష్టిసారించింది. ప్రభుత్వం వచ్చిన మూ డున్నరేళ్ల తర్వాత తొలిసారిగా దివ్యాంగులకు ఉచితంగా మూడుచక్రాల స్కూటీలను ఇవ్వాలని నిర్ణయించింది. గత టీడీపీ ప్రభుత్వం తరహాలో వందల్లో కాకుండా అతి తక్కువగా ఒక్కో నియోజకవర్గానికి కేవలం పదేసి మాత్రమే మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఏడు నియోజక వర్గాలకు 70 స్కూటీలు మాత్రమే మంజూరయ్యాయి. స్కూటీ పెప్‌ కంపెనీకి చెందిన ఈ ఒక్కో బైక్‌ విలువ రూ.95వేలు. దీన్ని ఉచితం గానే లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇం దులోభాగంగా జిల్లాలో అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ లబ్ధిదారులను ఆహ్వానించింది. పది నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 45ఏళ్ల మధ్యలో ఉన్న దివ్యాం గులు పథకానికి అర్హులుగా నిర్ధారించారు. 70శాతం నుంచి 100శాతం మధ్యలో వైకల్యం ఉన్నవాళ్లు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 70 స్కూటీలకు 309 మంది ది వ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వందల్లో వచ్చిన ధ్రువ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రూ.95వేల విలువైన స్కూటీ లు ఉచితంగా వస్తుండడంతో ఎక్కడికక్కడ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు వాలిపోయారు. అసలే తొలిసారిగా తమ ప్రభుత్వం ఇస్తు న్న వాహనాలు కావడంతో తమ అనుచరులు సూచించిన దివ్యాంగుల కు వీటిని మంజూరు చేయాలంటూ పైరవీలు ప్రారంభించారు.

సగం స్కూటీలు మాకే..

తమ నియోజవర్గంలో ఎవరెవరికి ఈ స్కూటీలు మంజూరు చేయాలో సూచిస్తూ ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం తదితర నియోజకవర్గాలనుంచి సిఫార్సు లేఖలు జిల్లా దివ్యాంగుల సం క్షేమశాఖతోపాటు జేసీ కార్యాలయానికీ ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు పంపించారు. తాము సూచించిన దరఖాస్తుదారులకు బైక్‌ లు మంజూ రు చేయాలంటూ అందులో ప్రస్తావించారు. సిఫార్సు లేఖలతోపాటు ఫోన్లు కూడా చేస్తూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో నియోజకవర్గా నికి పది స్కూటీలు మంజూరైతే సదరు ఎమ్మెల్యేలు ఐదుగురు పేర్లతో కూడిన సిఫార్సు జాబితా పంపారు. ఒకరకంగా నియోజకవర్గానికి కేటా యించిన స్కూటీల్లో సగం తమవారికే ఇప్పించుకునేందుకు తీవ్రస్థాయి లో ఒత్తిడి తెస్తున్నారు. ఇలా వచ్చిన సిఫార్సు లేఖల్లో నిబంధనల ప్రకారం చాలామందికి వైకల్యశాతం సరిపోవడం లేదు. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఏం చేయాలో తెలియక అధికారులు తలపట్టు కుంటున్నారు. తీరా నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేస్తే ఇరుకునప డతామనే ఆందోళనతో సతమతమవుతున్నారు. అలాగని అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లు కాదనలేక నియోజకవర్గానికి మూడు స్కూటీల వర కు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు సూచించిన పేర్లకు సమ్మతి తెలప డానికి సిద్ధమయ్యారు. దీంతో అసలు దరఖాస్తుదారులకు అన్యాయం జరిగే పరిస్థితి పొంచి ఉంది. మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూ చించిన పేర్ల జాబితాను తీసుకుని వారి అనుచరులు అప్పుడే వసూళ్లు మొదలుపెట్టేశారు. రూ.95వేల విలువైన స్కూటీ ఉచితంగా వస్తుండ డంతో అందులో సగం పిండుతున్నారు. రూ.40వేలనుంచి రూ.50వేల వరకు తమకు ఇస్తే కచ్చితంగా లబ్ధిదారుల జాబితాలో పేరు ఖాయం చేస్తామని బేరసారాలు ప్రారంభించారు. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేటలో కీలక నేతల అనుచరులు కొందరు దరఖాస్తుదారులనుం చి అడ్వాన్సుగా రూ.30వేల వరకు పిండేశారు. స్కూటీ చేతికి వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు తీసుకునేలా కొందరితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేల వెంట ఉండి తాము డబ్బులు వ సూలు చేసిన దరఖాస్తు దారుడికి స్కూటీ వచ్చేలా విపరీతంగా ప్ర యత్నాలు మొదలుపెట్టారు. కొందరు అనుచరులు ఎమ్మెల్యేలతో అదే పనిగా అధికారులకు ఫోన్లు చేయిస్తు న్నారు. మరికొందరు నేరుగా కాకి నాడలో జిల్లా కార్యాలయం వద్దకు వచ్చి అధికారులను కలుస్తూ సద రు ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరి గిపోతుండడంతో ఏంచేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తులు భారీగా రావడంతో ఎవరికి ప్రాధాన్యమివ్వాలో తేల్చుకోలే క గింజుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి మంజూరైన పదేసి స్కూటీల్లో ఎమ్మెల్యే కోటా కింద నాలుగేసి బైక్‌లు ఇవ్వడానికి తెరవె నుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో నాలుగురోజుల్లో అర్హుల తుది జాబితా జేసీ వద్దకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారా? నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఆమోదముద్ర వేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Updated Date - 2022-11-25T01:54:00+05:30 IST

Read more