పాఠశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-12-31T01:16:08+05:30 IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొవ్వూ రు రెవెన్యూ డివిజన్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పీవీ రవికుమార్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించాయి.

పాఠశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

కొవ్వూరు, డిసెంబరు 30: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొవ్వూ రు రెవెన్యూ డివిజన్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పీవీ రవికుమార్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు మండలం వాడపల్లి జడ్పీ హైస్కూల్‌, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి, బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం చెముడులంక జడ్పీ హైస్కూళ్ల ను అధికారులు తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు, జగనన్న విద్యాకానుక పథకం కింద అందజేసిన కిట్లు పంపిణీ, నాణ్యత, గోరుముద్ద పథకం ద్వారా మద్యాహ్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణ, ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారా? లేదా? పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై తనిఖీలు చేపట్టారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఎస్పీ రవికుమార్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో ఇన్స్‌పెక్టర్లు సత్యకిషోర్‌, శ్రీనివాసరెడ్డి, రమేష్‌, తహశీల్దార్‌ విజయకుమార్‌, వ్యవసాయాధికారి భార్గవమహేష్‌, జియాలజిస్ట్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:16:08+05:30 IST

Read more